కాఫీవిత్…ఆర్.రమాదేవి పొయెట్రీ..842-ఎ.రజాహుస్సేన్

(మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం)
*కాఫీవిత్…ఆర్.రమాదేవి పొయెట్రీ..842
అతగాడు ‘లేడనే’నిజం కంటే,’ఉన్నాడనే’అబద్ధమే
బాగుంటుంది..ఎందుకుంటే భావనాలోకంలో అత
గా డెప్పుడూ చిరంజీవే..ఊహల్లో అతడెప్పుడూ
నిత్యనూతనుడే.ఈ క్యాన్వాస్ మీదనే రమాదేవి
కవిత్వం అందమైన బొమ్మల్ని చెక్కుతుంది..అలాం
టి అందమైన మూడు చిత్రాల్ని ఇప్పుడు చూద్దాం.!
1*
ఓయ్.!
నువ్వు రాకుంటే యేమిలే
రాత్రంతా నీ బొమ్మే గీశాను
కళ్ళు చూసింది కలకు అందదా!
నా కలలు ఓడిపోవడం
రవ్వంత కూడా ఇష్టం లేదు మరి”!!
అతగాడు వస్తాడని ఆమె ఎదురు చూసింది.చాలా
సేపు అలా ఎదురుచూసింది..ఎంతకూ రాలేదు..‌
ఇక లాభంలేదని ఆ రాత్రి అతగాడి బొమ్మ గీసింది.
ఆ బొమ్మ చూస్తూ నిద్రపోయింది.నిద్రలో కలొచ్చిం
ది.కలలో అతగాడు కనిపించాడు.అతగాడి బొమ్మ
గీస్తూ..అతడ్నే చూస్తూ..నిద్రపోయింది కదా!కళ్ళు
చూసిందే..కలలో కనిపించింది.కలలో అతగాడొచ్చా
డు..ఆమె కల గెలిచింది.ఆమెకు కలలు ఓడిపోవ
డం అస్సలిష్టముండదు.‌అందుకేనేమో? ఆమె కల కు అపజయమే లేదు..అది ఎప్పుడూ గెలుస్తూనే వుంటుంది..!!
2*
“ఎందుకో ... ఈవేళ సమయం
కచ్చగా కయ్యాలమారి అయ్యింది
నేను పోగేసుకున్న సమయానికి
పోగొట్టుకున్న సమయానికి లెక్కలు తేల్చమని...
పోగొట్టుకున్న సమయంతో పేచీలేదు
అదెప్పుడో పగడపు దీవులై
తెలియని పూలుతో అల్లుకొని
అలవిగాని కలల మడతలైనాయి
ఇప్పుడు
పేచీ అంతా పోగేసుకున్న సమయానిదే
ఉక్కిరి బిక్కిరవుతున్న సమయాన్ని
లాలించి బుజ్జగించి తివాచి పరచి కూర్చోబెట్టాను
ఓయ్..!
ఓసారి వస్తావా…?
వచ్చి తీసుకుపోరాదూ ..
వీలైతే సమయాన్ని
కుదిరితే నన్ను కూడా…”!!
సమయం…సమయం..సమయం చేసే చిత్రం… అంతా ఇంతాకాదు.‌ఆమె కొంత సమయాన్ని ..
పోగేసుకుంది..కొంత సమయాన్నీపోగొట్టుకుంది..
ఎందుకో ఈవేళ మాత్రం సమయం కచ్చగా కయ్యా
లమారిగా మారింది..ఆమె పోగేసుకున్న సమయా
నికి , పోగొట్టుకున్న సమయానికి లెక్కలు తేల్చమని
కూర్చుంది.‌
ఇప్పుడెలా?
పోగొట్టుకున్న సమయంతో ఎలాగూ పేచీలేదు …
అది పగడపు దీవులై తెలియని పూలతో అల్లు
కొని అలవిగాని కలల మడతలయ్యాయి‌.
ఇక ఇప్పుడు పేచీ అల్లా…
ఆమె పోగేసుకున్న సమయానిదే…
అందుకే ఉక్కిరి బిక్కిరవుతున్నసమయాన్ని ఆమె.
లాలించి బుజ్జగించి తివాచి పరచి కూర్చోబెట్టింది.
3*
“నువ్వు నాతో ఉన్నావో లేదోనన్న
ఆలోచనకు చోటెక్కడ..
నీవెప్పుడూ చిటికెలో వస్తానంటూ
సమయాన్ని భుజానికెత్తుకొని
ఎక్కడెక్కడో పంచిపెడుతుంటావు...
నాకై సమయాన్ని
దాచుకుని వస్తావని ఎదురుచూస్తూ..
నా సమయాన్ని కూడా
పూర్తిగా నీకు అప్పజెప్పి నిలుచుంటాను..
నీకు నాకు మధ్య
తేలని లెక్కల్లో ఇదొకటి…”!!
* ఆర్..రమాదేవి..!!
అతడుఆమెతో ఉన్నాడో,లేడో అన్న ఆలోచకు చోటేలేదు…అతడు ఇప్పుడే వస్తానంటూ వెళ్ళి
భుజానకెత్తుకున్న సమయాన్ని ఎక్కడెక్కడో పంచిపెడుతుంటాడు..‌
ఆమె మాత్రం అతగాడు తనకోసం సమయాన్ని దాచుకువస్తాడని ఎదురుచూస్తూ….తన సమ
యాన్నికూడా..‌అతగాడికే అప్పజెప్పినిలుచుండి
పోయింది..
ఇప్పుడు..
అతగాడికి, ఆమెకు మధ్య తేలని లెక్కల్లో
ఇది కూడా చేరిపోయింది…!!
ఈ లెక్కల పంచాంగం ఇప్పుడప్పుడే తేలేదికాదు..
లోకంలో ప్రేమ వున్నంతకాలం..ప్రేమికుల మధ్య..
ఈ లెక్క తేలదు..అంటున్న రమాదేవి మాట నిజ
మని వేరేచెప్పాలా?
*ఎ.రజాహుస్సేన్..

 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!